News January 26, 2025
కథలాపూర్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన కనికరపు నర్సయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. నిన్న తన భార్యతో గొడవ పడి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టగా.. ఆమె తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 12, 2025
SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

<
News November 12, 2025
సూర్యాపేట: బయటపడ్డ కాకతీయ కాలం నాటి శివలింగం

తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.
News November 12, 2025
మొంథా తుఫాన్ నష్టం.. ఉమ్మడి జిల్లాకు నిధుల విడుదల

మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 30న కురిసిన వర్షాలతో వరంగల్, హనుమకొండ నగరాలు జలమయమయ్యాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలు సందర్శించి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం రూ.12.68 కోట్లు విడుదల చేసింది. పత్తి, వరి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతినగా, రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.


