News March 12, 2025
కథలాపూర్: నేటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కథలాపూర్ మండలం తక్కళపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధ, గురువారాలు స్వామివారి పల్లకిపై ఊరేగింపు, శుక్రవారం జాతర మహోత్సవాలు, శనివారం వేకువజామున స్వామివారి రథోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలన్నారు.
Similar News
News November 20, 2025
NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.
News November 20, 2025
ములుగు: గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అదేవిధంగా పలువురిని సన్మానించారు. గ్రంథాలయాలను మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
News November 20, 2025
మదనపల్లెలో 10 కిలోల టమాటాలు రూ.610

మదనపల్లెలో టమాటా ధరలు పైపైకి పోతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్కు గురువారం 135 మెట్రిక్ టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు రూ.610 అమ్ముడు పోగా.. రెండవ రకం రూ.580, మూడవ రకం రూ.500లతో కొనుగోలు జరుగుతున్నట్లు టమాటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. పంట దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వారు తెలిపారు.


