News April 12, 2025
కథలాపూర్: బైకు అదుపుతప్పి యువకుడి మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ అజయ్ (17) అనే యువకుడు శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి పడిపోగా మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అజయ్ బైక్పై గ్రామ శివారులోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News November 20, 2025
కొడంగల్కు ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి రాక

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న కొడంగల్ శివారులోని ఎన్కేపల్లి గేటు వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ కిచెన్ షెడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. స్థలం పరిశీలనతో అధికారులతో చర్చించారు. అనంతరం హకీమ్పేట్లో ఎడ్యూకేషన్ హబ్ ఏర్పాటు శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించారు.
News November 20, 2025
వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 20, 2025
రేపు సాయంత్రానికి కోర్టుకు చిన్నఅప్పన్న

తిరుమల కల్తీ నెయ్యి కేసులో CBI సిట్ అధికారులు విచారణ చేస్తున్న ఏ-24 నిందితుడు చిన్ని అప్పన్న కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలలోపు ఆయనకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. గురువారం(ఇవాళ) విచారణలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.


