News July 28, 2024

కథలాపూర్: వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం

image

కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో తిరుమలేష్ (18) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. తిరుమలేష్ గత మూడు రోజుల క్రితం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 13, 2024

GREAT: జగిత్యాల: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్నాచెల్లెళ్లు

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు లక్కం మునిరాజ్, లక్కం రిషిత ఇటీవలే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జగిత్యాల పట్టణంలో MLC జీవన్ రెడ్డి వారిని శాలువాలతో సన్మానించి, మెమెంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరారు.

News October 13, 2024

అక్కన్నపేట: విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

image

దసరా పండుగ రోజు విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిఖ కీర్తన్య (8) అనే చిన్నారి దుర్గామాత నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన డీజే కరెంటు తీగ తాకి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News October 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. @ జగిత్యాల లో కస్టమర్ పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడి. @ హుస్నాబాద్ లో దసరా వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ భీమారం మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ శంకరపట్నం మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.