News March 23, 2024
కదలనున్న ‘వారాహి’.. పిఠాపురం నుంచే ఎందుకంటే..?

ఉమ్మడి తూ.గో జిల్లాపై TDP-జనసేన-BJP కూటమి ఫోకస్ పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లనుండటం కేడర్‌లో జోష్ నింపింది. శక్తిపీఠం కొలువై ఉండటం, శ్రీపాద వల్లభుడు జన్మించిన పవిత్ర భూమి కావడంతో పవన్ ‘వారాహి’ ఇక్కడి నుంచే ప్రచారంలో దిగనున్నట్లు తెలుస్తోంది. 3రోజులు అక్కడే ముఖ్య నేతలతో భేటి కానున్నారట. త్వరలో చంద్రబాబు, లోకేశ్ సైతం పర్యటన చేపట్టనున్నారు.
Similar News
News March 5, 2026
రాజమండ్రి కల్తీ పాలు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం (1:25 PM) హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 11 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు 8 మంది మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.వెంకటలక్ష్మి (69) మృతి చెందినట్లు తెలిపారు.
News March 5, 2026
రాజమండ్రి: 7, 8 తేదీల్లో జిల్లాలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈనెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన 6వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం చేరుకొని ఓఎన్‌జీసీ అతిథి గృహంలో బస చేస్తారు. 7న జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహింనున్నారు. అనంతరం ధవళేశ్వరంలో నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొని, అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
News March 5, 2026
రాజమండ్రి: ఈనెల 8న జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) ఆదేశాల మేరకు ఈ నెల 8న తూర్పుగోదావరి జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి(DSDO) డి.ఎమ్.ఎమ్. శేషగిరి తెలిపారు. హుకుంపేటలోని బొప్పన స్పోర్ట్స్ క్లబ్‌లో టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు, ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


