News January 7, 2025
కదిరిలో బాలయ్య కటౌట్
అనంతపురం జిల్లాలో బాలయ్య ఫ్యాన్స్ సందడి మొదలైంది. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో ఆయా మండల కేంద్రాల్లో ‘డాకు’ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కదిరిలోని సంగం థియేటర్ వద్ద బాలయ్య నిలువెత్తు కౌటౌట్ ఏర్పాటు చేయగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ <<15084871>>ఈవెంట్<<>> అనంతపురంలో జరుగుతుండటంతో జిల్లాలో ‘డాకు’ ఫీవర్ కనిపిస్తోంది.
Similar News
News January 9, 2025
ఆలయాల వద్ద ప్రత్యేక భద్రత: ఎస్పీ
అనంతపురం జిల్లాలో ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. శుక్రవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే ప్రజలందరూ పోలీసులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
News January 9, 2025
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేశాం: బాలకృష్ణ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో ఈ రోజు జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ‘తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది’ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.
News January 9, 2025
మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు
తిరుపతిలో తొక్కిసలాట కారణంగా మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ అనంతపురంలో జరిగే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. సినీ ప్రముఖులతోనే ఈవెంట్ యథాతథంగా కొనసాగనుంది.