News February 15, 2025

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్‌పై కేసు

image

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. నల్లగుట్టవీధికి చెందిన అశ్విని కుమారుడు భానుతేజ ఓ ప్రవేటు స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నారు. స్కూల్‌లో టీచర్ మధు అడిగిన ప్రశ్నకు తన కుమారుడు సమాధానం చెప్పలేదని కర్రతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలయ్యాయని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Similar News

News February 24, 2026

మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

image

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||

News February 24, 2026

30 లక్షల ఇళ్లపై సోలార్ వెలుగులు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఘనతపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ ఇంధన భద్రత, స్వయం సమృద్ధి దిశగా వేసిన కీలక అడుగు అని కొనియాడారు.

News February 24, 2026

DMK కూటమిలో సీట్ల సెగ.. 45 స్థానాలకు కాంగ్రెస్‌ పట్టు?

image

తమిళనాడు ఎన్నికల వేళ అధికార DMK నేతృత్వంలోని కూటమిలో సీట్ల గొడవ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 45 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో DMK ఓడిపోయిన స్థానాల్లో కనీసం 20 చోట్ల తమకు బలం ఉందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. CM స్టాలిన్ మాత్రం కాంగ్రెస్‌కు 25 సీట్లకు మించి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదట. మరోవైపు IUML, MMK చెరో 5 సీట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్.