News February 15, 2025
కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్‌పై కేసు

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. నల్లగుట్టవీధికి చెందిన అశ్విని కుమారుడు భానుతేజ ఓ ప్రవేటు స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నారు. స్కూల్‌లో టీచర్ మధు అడిగిన ప్రశ్నకు తన కుమారుడు సమాధానం చెప్పలేదని కర్రతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలయ్యాయని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Similar News
News March 22, 2025
జియ్యమ్మవలస : పాము కాటుతో వ్యక్తి మృతి

జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గ్రామంలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బిడ్డిక.వెంకటి నిద్రిస్తున్న సమయంలో ఏడు గంటలకు విషపూరితమైన పాము కాటు వేసింది. దీంతో గమనించిన కుటుంబీకులు హుటా హుటిన చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు.
News March 22, 2025
లాప్టాప్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం: రామ్ కుమార్

ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌ట్యాప్‌లు, బధిరుల టచ్ ఫోన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మేనేజర్ రామ్ కుమార్ శుక్రవారం తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం, ఐటీఐ, పాలిటెక్నిక్‌లో విద్యనభ్యసిస్తూ రోజూ కాలేజీకి వెళ్లి చదువుచున్న అభ్యర్థులు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
News March 22, 2025
ఐపీఎల్ బెట్టింగుల పై పోలీసుల నిఘా

నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు నిఘా పెంచారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లతో బెట్టింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని సీపీ శంఖబ్రత భాగ్చీ ఆదేశాలు జారి చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా గానీ మరే ఇతర విధంగా గాని బెట్టింగ్‌లకు పాల్పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.