News April 15, 2024
కదిరి: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పవన్ కుమార్ రెడ్డి

కదిరి నియోజక వర్గానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు చంద్రబాబు, లోకేశ్, నియోజక వర్గం అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News April 13, 2026
హౌసింగ్ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ హౌసింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News April 13, 2026
PGRSలో 169 పిటిషన్లు స్వీకరించాం: SP జగదీష్

అనంతపురం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 169 పిటిషన్లు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి సమస్యలను తెలుసుకుని పోలీసు అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.
News April 13, 2026
రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


