News March 16, 2025

కదిరి నరసింహ స్వామి సేవలో కలెక్టర్

image

కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లగా ఆలయ అర్చకులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.

Similar News

News November 19, 2025

ASF: ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

image

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, ఇంటి పన్నుల వసూలు, ఉపాధి హామీ పనులపై మాట్లాడారు.

News November 19, 2025

భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ. 65.93 లక్షలు

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం హుండీలు విప్పి లెక్కింపు చేశారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 65,93,481 ఆదాయం వచ్చింది. వీటితో పాటు 2483 యూఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు సహా ఇతర విదేశీ కరెన్సీలు లభించాయి. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, వెండిని తిరిగి హుండీలో వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

News November 19, 2025

ఆసిఫాబాద్‌లో రేపు మినీ జాబ్ మేళా

image

ఈ నెల 20న పాత కలెక్టర్ కార్యాలయం జనకాపూర్‌లో ఉదయం 10.30 గంటలకు TASK TRAINING CENTRE ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.