News March 23, 2025
కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం జిల్లాలో 43 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 43బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. NHAIపరిధిలో 4చోట్ల, జాతీయ రహదారుల్లో 33చోట్ల, ఇతర రోడ్లపై 6చోట్ల ప్రమాదకర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 126కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో తేలింది. మరమ్మతుల కోసం రూ.15కోట్లు అవసరమని అంచనా వేశారు. మున్సిపల్ పరిధిలోని 470గుంతల పూడ్చివేతకు 6ప్యాకేజీలుగా టెండర్లు చేపట్టారు.
News November 20, 2025
నేడు పల్నాటి వీరుల రాయబారం

పల్నాటి వీరుల ఉత్సవాలలో భాగంగా గురువారం “రాయబారం” కార్యక్రమం నిర్వహించనున్నారు. పల్నాటి యుద్ధంలో “రాయబారం” కీలక ఘట్టం. బ్రహ్మనాయుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు అలరాజును గురజాల రాజు నలగామరాజు వద్ద సంధికి రాయబారిగా పంపుతాడు. సందికి వెళ్లిన అలరాజును యుద్ధ నీతిని విస్మరించి ప్రత్యర్థులు చంపుతారు. దీంతో ఆగ్రహించిన బ్రహ్మనాయుడు యుద్ధ ప్రకటన చేయడంతో పల్నాడు యుద్ధానికి అంకురార్పణ జరిగింది.
News November 20, 2025
ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.


