News March 23, 2025
కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 29, 2025
కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఆదివారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు-2025 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
News March 29, 2025
ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న అంజనప్ప

అనంతపురం జిల్లాకు చెందిన తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.అంజనప్ప శుక్రవారం ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. కనుమరుగవుతున్న కళా రూపాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో 221 కళాభిషేకం కార్యక్రమాలు పూర్తి చేసినందుకుగాను ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు దక్కిందని తెలిపారు.
News March 29, 2025
గుంతకల్లు: రైల్లో ప్రయాణికుడి మృతి

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.