News February 11, 2025
కదిరి: వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

కదిరి అడపాల వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఆత్మహత్య కేసులో భర్త కేశవయ్యను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన భర్త కేశవయ్య పెడుతున్న హింసలను తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం కేశవయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News October 30, 2025
జనగామ: రైతులకు అండగా ఉండండి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
News October 30, 2025
నిర్మల్ పట్టణంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం

నిర్మల్ పట్టణంలో గురువారం ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, నిర్మూలన మార్గాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కలిగేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


