News February 11, 2025
కదిరి: వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

కదిరి అడపాల వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఆత్మహత్య కేసులో భర్త కేశవయ్యను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన భర్త కేశవయ్య పెడుతున్న హింసలను తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం కేశవయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 23, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News March 23, 2025
HNK: జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్..

✓ HNK: ముగ్గురు చైన్ స్నాచర్లతో పాటు దొంగ అరెస్ట్
✓ నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
✓ HNK: బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: CP
✓ కమలాపూర్: ఇసుక ట్రాక్టర్ పట్టివేత
✓ శాయంపేట పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✓ HNK: విద్యార్థులకు షీ-టీంపై అవగాహన
✓ ఇంతేజార్ గంజ్: పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు
News March 23, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 3 నుంచి పదోన్నతి పొందిన టీచర్లకు శిక్షణ: డీఈవో

జిల్లాలో నూతనంగా పదోన్నతి పొందిన గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3 నుంచి 4 వరకు రెండు రోజుల పాటు పాఠశాల అభివృద్ధి, విద్యా బోధన తదితర అంశాలపైన మెదక్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ శిక్షణను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.