News February 18, 2025
కనకగిరి ఫారెస్ట్‌లో నిపుణుల పర్యటన

కనకగిరి ఫారెస్ట్‌లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కీ.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News March 14, 2025
ఖమ్మం: రుణాలు చెల్లించలేదని జెండాలు పాతారు!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పంట రుణాలు చెల్లించలేదని రైతులు పొలాల వద్ద బ్యాంక్ అధికారులు జెండాలు పాతారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, అరేగూడెం గ్రామాల్లో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించలేదంటూ అధికారులు గురువారం ఎర్రజెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు తీసుకొని స్పందించకపోవడంతో జెండాలు పాతినట్లు చెప్పారు.
News March 14, 2025
ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు.!

ఖమ్మం జిల్లాలో వేసవి ప్రభావం ఒక్కసారిగా పెరిగింది. గురువారం మధిరలో 40.4°, (ఏఆర్ఎస్)లో 40.3°, గేట్ కారేపల్లి, సిరిపురం, ఎర్రుపాలెంలో 40.1°, వైరా, సత్తుపల్లిలో 40.0° ఉష్ణోగ్రత నమోదైంది. మరో 39 ప్రాంతాల్లో 39-39.9° మధ్య, 9 ప్రాంతాల్లో 38°, 2 కేంద్రాల్లో 37° నమోదైంది. అత్యల్పంగా కూసుమంచిలో 36° నమోదయింది, మార్చి రెండో వారంలోనే భానుడి తీవ్రత పెరగడం గమనార్హం.
News March 14, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.