News February 18, 2025
కనకగిరి ఫారెస్ట్లో నిపుణుల పర్యటన

కనకగిరి ఫారెస్ట్లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కి.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి దూరం

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఒత్తిడి దూరమవుతుందని నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. పట్టణంలోని SDR పాఠశాలలో 11వ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై విభిన్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఐ కృష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కొత్తపేట: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

కొత్తపేట మండలం మద్దుల మెరకలో విషాదం చోటుచేసుకుంది. తాటి చెట్టుపై నుంచి పడి చుట్టుగుళ్ల ఏడుకొండలు (45) అనే గీత కార్మికుడు మృతి చెందాడు. శనివారం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కిన ఆయన ప్రమాదవశాత్తు పట్టుతప్పి కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.


