News October 26, 2024
కనకరాజు మరణం బాధాకరం: కేంద్రమంత్రి బండిసంజయ్

ఆదివాసీల జానపదమైన గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన శ్రీ కనకరాజు మరణం బాధాకరమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ తరాలకు అందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎర్రకోట వేదికగా గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన మరణం తీరని లోటని వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు, X లో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Similar News
News July 6, 2025
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.