News January 26, 2025
కనగల్ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి MASTER PLAN

దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎండోమెంట్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించారు. సుమారు రూ.4కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థపతి శ్రీ వల్లి నాయర్, దుర్గాప్రసాద్, గణేశ్, కిరణ్, ఆలయ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో జల్లేపల్లి జయరామయ్య, దేప కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
Similar News
News December 24, 2025
నల్గొండ జిల్లాలో వణికిస్తున్న చలి

జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలి గాలులు కూడా వీస్తుండడంతో పల్లె ప్రజలతో పాటు పట్టణ వాసులు ఉదయం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
News December 24, 2025
NLG: కేటీఆర్ రాక.. బీఆర్ఎస్‌లో నయా జోష్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో గులాబీ నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా గెలిచిన 230 మంది సర్పంచులను సన్మానించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ నింపింది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి.. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ చేసిన ప్రసంగంతో నూతన సర్పంచులు, ఆ పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.
News December 24, 2025
నల్గొండ: వారికి అభ్యర్థులు నచ్చలేదు..!

పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో దానికి 3,132 ఓట్లు పడ్డాయి. అడవిదేవులపల్లి మండలంలో తక్కువగా 34 ఓట్లు పోలవగా, పెద్దవూర మండలంలో అత్యధికంగా 267 మంది నోటాకు ఓటేశారు. కొంతమందికైతే సరిగా ఓటేయడం రాలేదు. దీంతో 12,253 ఓట్లు చెల్లలేదు. కాగా జిల్లాలో మొత్తంగా 10,37,411 మంది ఓటర్లుండగా 9,00,338 మంది ఓటేశారు.


