News April 1, 2025
కనగానపల్లిలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన ఓబిరెడ్డి (32) మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఓబిరెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఓబిరెడ్డి ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 4, 2025
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా

పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు పాస్ అవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా Xలో స్పందించారు. ఇక అవినీతి, అన్యాయం అంతమైనట్లేనని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు న్యాయం, సమానత్వానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేదలు, మహిళలు, పిల్లలకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఉభయ సభల్లో బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
News April 4, 2025
ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపన్యాసంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 10 నుంచి ఇవాళ్టి వరకు జరిగాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.