News October 20, 2024
కనపడితే సమాచారం ఇవ్వండి: ఖమ్మం పోలీసులు

ఖమ్మంలో చోరీలకు పాల్పడుతున్నాడంటూ ఓ వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అతని వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వన్ టౌన్ సీఐ 87126 59106, ఖమ్మం టౌన్ ఏసీపీ 87126 59105 నంబర్లకు కాల్ లేదా మెసేజ్ చేసి వివరాలు తెలియజేయాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Similar News
News October 22, 2025
ఖమ్మం: EVERY CHILD READS ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో EVERY CHILD READS కార్యక్రమాన్ని నెల రోజుల పాటు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1–5 తరగతి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంటసేపు కేటాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అక్షరాలు, పదాలు, పేరాలు అర్థం చేసుకునే స్థాయికి చేరేలా చేయాలన్నారు.
News October 22, 2025
ఖమ్మం: రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ అమలు చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 8వ జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి పాల్గొన్నారు.
News October 22, 2025
ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.