News March 14, 2025
కనిగిరిలో యువకుడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లూరు మండలానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఆమె కనిగిరిలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు సత్తెనపల్లికి చెందిన రవితేజ(28) పరిచయమమ్యాడు. ‘నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మానాన్నతో మాట్లాడతా’ అంటూ రవితేజ కనిగిరికి వచ్చాడు. ఆమె వద్దని చెప్పడంతో వెళ్లి ఫుల్గా మద్యం తాగాడు. మరోసారి ఆమె ఇంటికి వచ్చి చేయి కోసుకోవడంతో చనిపోయాడు.
Similar News
News December 16, 2025
ప్రకాశం: పరారైన ఖైదీ.. 24 గంటల్లో పట్టుబడ్డాడు

ఒంగోలు బస్టాండ్ నుంచి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారైన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జైలు నుంచి వైజాగ్కు ఇరువురు నిందితులను తీసుకువెళ్తుండగా ఒంగోలు బస్టాండ్ వద్దకు ఆదివారం రాత్రి ఎస్కార్ట్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పారిపోయాడు. కాగా ఒంగోలు వన్టౌన్ PSలో ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
News December 16, 2025
ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

ఈనెల 17,18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికలగురించి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు.
News December 16, 2025
సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలతో వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.


