News September 23, 2024
కనిగిరిలో సెప్టెంబర్ 27న ‘మెగా జాబ్ మేళా’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీడప్ – ఆధ్వర్యంలో.. సెప్టెంబరు 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో జరగబోవు “మెగా జాబ్ మేళా” వాల్ పోస్టర్‌ను సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 4, 2024
ప్రకాశం: అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు
ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.
News October 4, 2024
ప్రకాశం: అక్రమ రవాణాపై దృష్టి సారించండి: కలెక్టర్
జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మైనింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు.
News October 3, 2024
చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి
చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.