News July 19, 2024

కనిగిరిలో స్వల్ప భూ ప్రకంపనలు

image

కనిగిరి మండలం నందన మారెళ్లలో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రకంపనాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Similar News

News October 18, 2025

ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాంధీ

image

చీమకుర్తికి చెందిన తెల్లమేకల గాంధీని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా పార్టీ అధిష్టానం నియమించింది. తనను నమ్మి పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని గాంధీ తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

News October 18, 2025

బాణసంచా విక్రయదారులకు SP సూచన.!

image

అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా బాణసంచా విక్రయ కేంద్రాల్లో 18ఏళ్లలోపు పిల్లలను పనిలో ఉంచరాదన్నారు.

News October 18, 2025

పెద్దారవీడు: పేకాట ఆడివారికి 2 రోజులు శిక్ష

image

మండలంంలోని రేగుమానుపల్లి గ్రామ పొలాల్లో పేకాట శిబిరంపై సెప్టెంబర్ ఆరవ తేదీ పోలీసులు దాడి చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రూ.1,09,910లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 14 మంది ముద్దాయిలకు మార్కాపురం జడ్జి బాలాజీ విచారించి ఒక్కొక్కరికి రూ.300 జరిమానా 2 రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.