News August 14, 2024
కనిగిరి: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
కనిగిరిలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కనిగిరిలోని మోడల్ స్కూలుకు విద్యార్థులను తీసుకెళ్లే RTC బస్సు బుధవారం మొగుళ్లూరు పల్లి వద్ద ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సు రోడ్డు మార్జిన్‌లోకి ఒరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News September 13, 2024
బాలినేని పార్టీ మార్పుపై మరోసారి చర్చ
మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్‌లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 13, 2024
లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ
ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సూచించారు.
News September 12, 2024
ప్రకాశం: వరద బాధితులకు రూ.1 కోటీ 55 లక్షల విరాళం
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని గోణసపూడి గ్రామవాసి, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం CM చంద్రబాబు నాయుడిని కలిసి రూ.1,55,55,555 భారీ చెక్కును విక్రం నారాయణ అందజేశారు. ఆపద సమయాల్లో వరద బాధితులకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.