News August 19, 2024
కనిగిరి: ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని కనిగిరి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు కనిగిరికి చెందిన ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద రూ.8,50,000 డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు, ఎస్పీతో తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 14, 2024
ఒంగోలు సంఘమిత్ర వద్ద రోడ్డు ప్రమాదం
ఒంగోలు పట్టణంలోనిసంఘమిత్ర ఆసుపత్రి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు, మేదరమెట్ల వద్ద లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.
News September 14, 2024
బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం
బాపట్ల జిల్లా యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు గ్రామంలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పూనూరు గ్రామానికి చెందిన తండ్రీ, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తండ్రీ, కొడుకులు తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
తిరుపతిలో ప్రకాశం జిల్లా విద్యార్థిపై కత్తితో దాడి
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థి లోకేశ్ తిరుపతి MBU యూనివర్షిటీలో చదువుతున్నాడు. అయితే శనివారం అతను ఓ థియేటర్‌లో సినిమాకు వెళ్లగా.. లోకేశ్ పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తోపాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరుపేటగా గుర్తించారు.