News July 10, 2025

కనిగిరి: జనసేనలో చేరిన దేవకి వెంకటేశ్వర్లు

image

కనిగిరికి చెందిన జాతీయ వాసవి సత్ర సముదాయాల ఛైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వెంకటేశ్వర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరి కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వైసీపీకి వెంకటేశ్వర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 1, 2025

ఒంగోలులో సందడి చేసిన హీరో నారా రోహిత్

image

ఒంగోలులో ఆదివారం సుందరకాండ చిత్రం యూనిట్ సందడి చేసింది. హీరో నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం విజయాన్ని అందుకోవడంతో అన్ని జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్, చిత్ర బృందంతో కలిసి ఆదివారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్దకు రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News September 1, 2025

మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

మార్కాపురం మండలం కోమటికుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గొట్టిపడియ గ్రామానికి చెందిన కొండయ్యగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఇద్దరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

News August 31, 2025

మార్కాపురం మీదుగా తిరుపతికి స్పెషల్ ట్రైన్!

image

జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు జిల్లా గుండా తిరుపతికి చేరుకోనుంది. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు.