News September 25, 2024

కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

image

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 12, 2025

ప్రకాశం: ఈనెల 13, 14న టీచర్లకు క్రీడలు.!

image

ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఈనెల 13, 14న ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్, మార్కాపురంలోని హైస్కూల్, కనిగిరిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో క్రీడలు జరుగుతాయన్నారు.

News December 12, 2025

ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష.!

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పునిచ్చారు. ఒంగోలుకు చెందిన నారాయణ మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2021లో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం న్యాయస్థానం నేడు నిందితుడికి శిక్ష విధించింది. పోలీసులను SP హర్షవర్ధన్ రాజు అభినందించారు.

News December 12, 2025

ప్రకాశం ప్రజలకు.. సైబర్ నేరాలపై కీలక సూచన.!

image

వాట్సాప్‌లలో వచ్చే క్యూ-ఆర్ కోడ్‌ల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం SP కార్యాలయం సూచించింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. సైబర్ నేరాల నియంత్రణకై IT విభాగం పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం క్యూఆర్ కోడ్ గురించి కీలక సూచన చేశారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్‌ల పట్ల అప్రమత్తంగా లేకుంటే, సైబర్ నేరానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు.