News November 9, 2024
కనిగిరి: వదిన గొంతు కోసిన మరిది
బ్లేడుతో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసిన ఘటన కనిగిరి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణంలోని గార్లపేట రహదారిలోని హోటల్‌లో టిఫిన్ చేస్తున్న పోలా కోటేశ్వరమ్మ అనే మహిళను మరిది ఆంథోనీ అనే వ్యక్తి బ్లేడుతో గొంతు కోసి గాయపరిచాడు. బంధువులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 11, 2024
ప్రకాశం జిల్లా జవాన్ ఎలా చనిపోయారంటే..?
ప్రకాశం జిల్లా కంభం మండలం <<14839505>>రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్<<>> వరికుంట్ల సుబ్బయ్య(43) జమ్మూలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. 25వ రాష్ట్రీయ రైఫిల్స్ హవల్దార్‌గా పనిచేస్తున్న సుబ్బయ్య పూంచ్ సెక్టార్ వద్ద పహారా కాస్తున్నారు. ఈక్రమంలో పొరపాటున ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. తన ప్రాణం పోవడం ఖాయమని భావించారు. సహచర జవాన్లను ‘GO BACK’ అంటూ అలర్ట్ చేశారు. కాసేపటికే ల్యాండ్ మైన్ పేలడంతో వీర మరణం పొందారు.
News December 11, 2024
విజయవాడకు వెళ్లిన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు
ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఎ. తమీమ్ అన్సారియా, జె. వెంకట మురళి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
News December 11, 2024
ఇడుపులపాయ IIITలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత
ఇడుపులపాయ IIIT ఓల్డ్ క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్‌లో ఇడుపులపాయ, ఒంగోలు IIITలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి IIIT ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు.