News April 24, 2024
కనిగిరి: 10వ తరగతిలో కవలలకు ఒకే మార్కులు

కనిగిరి పట్టణానికి చెందిన షేక్ అల్తాఫ్, షేక్ అసిఫ్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. పట్టణంలోని ఓ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించారు. ఒకేసారి జన్మించిన ఈ ఇద్దరూ ఒకే మార్కులతో పాస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని స్కూల్ యాజమాన్యంతోపాటు పలువురు అభినందించారు.
Similar News
News January 19, 2026
ఒంగోలులో యోగి వేమన జయంతి వేడుకలు

ఒంగోలు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో విశ్వకవి యోగివేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలక్రిష్ణలు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగివేమన తన పద్యం ద్వారా నీతిని సమాజానికి చాటి చెప్పారన్నారు.
News January 18, 2026
ప్రకాశం: ఫుల్‌గా తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.


