News March 14, 2025
కన్నాయిగూడెం: అస్వస్థతకు గురై కూలి మృతి

మిర్చి తోటకు పురుగుమందు పిచికారి చేస్తుండగా, అస్వస్థతకు గురై ఓ కూలి మృతి చెందిన ఘటన కన్నాయిగూడెంలో జరిగింది. ఎస్సై వెంకటేష్ వివరాలు.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాకేశ్ అనే వలస కూలి గురేవుల గ్రామంలోని సంతోష్ అనే రైతుకు పనికి వచ్చాడు. మిర్చి తోటలో పురుగుమందు పిచికారి చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 25, 2025
సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
News March 25, 2025
విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News March 25, 2025
మహిళలకు తగ్గిన లీడర్‌షిప్ పొజిషన్లు: టీమ్‌లీజ్

హయ్యర్ లీడర్‌షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్‌లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.