News February 8, 2025
కన్నాయిగూడెం: ఉర్సు ఉత్సవాలకు రావాలని సీతక్కకు ఆహ్వానం

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగే ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు రావాలని స్థానిక ముస్లిం సోదరులు మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. నజీరుద్దీన్, మునీర్, షాయక్ మాట్లాడుతూ.. ఉర్సు షరీఫ్ ఉత్సవాలు జరిగే దర్గా వద్ద విద్యుత్ సరఫరా చేయాలని, దర్గా దగ్గరకు వెళ్లేందుకు నూతన రోడ్డు మంజూరు చేయాలని సీతక్కను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో అప్సర్ పాషా, గౌస్, అజ్జు పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
గులాబీ గూటికి జీవన్ రెడ్డి.. కండువా కప్పనున్న KCR

TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి BRSలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న జగిత్యాలలో BRS భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీలో చేరిక తేదీని కన్ఫర్మ్ చేశారు. ఇక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పట్టు కోల్పోయిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
News April 10, 2026
సూర్యాపేట: పంట మార్పిడిలో జిల్లా వెనుకంజ

జిల్లాలో పంటల వైవిధ్యం లోపించడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని 6.24 లక్షల ఎకరాల సాగు భూమిలో 92.5% కేవలం వరి, పత్తి పంటలే సాగవుతుండటంతో రాష్ట్రంలోనే జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకే రకమైన పంటల వల్ల భూసారం తగ్గి, పెట్టుబడి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు పంట మార్పిడి చేపట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచిస్తున్నారు.
News April 10, 2026
ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.


