News February 10, 2025
కన్నాయిగూడెం: ఎన్నికల కోసం శిక్షణ.. కుప్పకూలిన HM

ఎన్నికల విధుల కోసం శిక్షణకు వెళ్లిన హెచ్ఎం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కన్నాయిగూడెం మండలంలో జరిగింది. తుపాకులగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం రాఘవరావు ఈనెల 3న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకరోజు శిక్షణకు వెళ్ళాడు. ఈ క్రమంలో అస్వస్థతతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు వరంగల్ తరలించారు. కాగా ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకులు కోరారు.
Similar News
News November 4, 2025
విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
News November 4, 2025
NZB: అపార్, యూడైస్ పనులను పూర్తిచేయండి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారులు, ప్రిన్సిపల్స్ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఈరోజు జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంటనే విద్యార్థుల అపార్, యూడైస్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ కచ్చితంగా ఆపార్, యూడైస్, పెన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు.
News November 4, 2025
VZM: ఉపాధి హామీ పనులకు వెండర్లకు శిక్షణ

విజయనగరంలోని స్థానిక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వెండర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ పనులకు సంబందించి ఆన్‌లైన్‌లో టెండర్లు దక్కించుకోవడంపై అమరావతి పీఆర్ఆర్డీ కార్యాలయ అధికారి గోపీచంద్ వెండర్లతో పాటు అధికారులకు అవగాహన కల్పించారు. పనుల నిర్వహణపై పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారద పాల్గొన్నారు.


