News December 26, 2024
కన్నుల పండుగగా రాములోరి నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Similar News
News January 13, 2025
ఖమ్మం: ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటే రూ.12వేలు: డిప్యూటీ సీఎం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి, సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో సహచర మంత్రులతో కలిసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
News January 13, 2025
కూసుమంచిలో 30 రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పూర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక నమూనా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 13న మంత్రి పొంగులేటి కూసుమంచి ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నెల రోజుల్లోనే పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలి నమునా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి వచ్చింది. రూ.5లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు.
News January 13, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రులు పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు