News January 27, 2025
కన్నుల పండువగా ‘అట్ హోమ్’ కార్యక్రమం

76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కన్నుల పండువగా “అట్ హోమ్” కార్యక్రమం జరిగింది. కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందులో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూధనరావు, సబ్ కలెక్టర్లు మేఘ స్వరూప్, నైదియాదేవి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
MBNR: పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు!

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబ్నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.
News February 24, 2026
రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. హాల్టికెట్ తీసుకున్నారా?

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలవగా.. ఇంకా తీసుకోనివారు <
News February 24, 2026
ములుగు: డీజీపీ ఎదుట లొంగిపోయిన దామోదర్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయాడు. అతనితో పాటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఇతర నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ‘పోరుకన్నా.. ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చింది.


