News February 28, 2025

కన్నుల పండువగా ఏడుపాయల మహా జాతర

image

ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర ప్రాంగణంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన హైలెట్. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు.

Similar News

News November 21, 2025

కామారెడ్డి: కస్తూర్బా విద్యార్థినికి పాముకాటు

image

రాజంపేటలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రిన్సిపల్ శ్రీవాణికి చెప్పారు. దీంతో ఆమెను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రాజు అమ్మాయిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

News November 21, 2025

అక్టోబర్‌లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

image

TG: అక్టోబర్‌లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.

News November 21, 2025

జగిత్యాల: సేకరణ సరే.. చెల్లింపుల్లో జాప్యమెందుకు..?

image

జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 14 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో మొన్నటి వరకు 4,311 మంది రైతుల నుంచి రూ.33.45 లక్షల విలువైన 1.39 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించారు. రైతుల నుంచి మొక్కజొన్నను సేకరించి 20రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే జమ అవుతాయని సంబంధిత అధికారులు అంటున్నారు.