News February 28, 2025
కన్నుల పండువగా ఏడుపాయల మహా జాతర

ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర ప్రాంగణంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన హైలెట్. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు.
Similar News
News March 20, 2025
ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

ఓవర్‌థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివిటీ కనుక దానికి దూరంగా ఉండండి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని ఏ విషయమైన ఇబ్బంది పెడితే 72 గంటల పాటు దాన్ని మర్చిపోండి. తర్వాత అది మిమ్మల్ని అంతగా వేధించదు. సోషల్ మీడియా అధికంగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక దానికి దూరంగా ఉండండి. ధ్యానం చేయడంతో కంగారు తగ్గడంతో పాటు వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకుంటారు.
News March 20, 2025
MNCL: చనిపోయినోళ్ల పేరు మీద లోన్లు.. రూ.కోటి ఘరానా మోసం

చోళ మండలం ఇన్వెస్ట్‌మెంట్&ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్‌లో ఘరానా మోసం జరిగినట్లు CI ప్రమోద్‌రావు తెలిపారు. చనిపోయిన ఆరుగురి పేర్ల మీద ఇద్దరు బ్యాంక్ అధికారులు లోన్స్ పంపిణీ చేశారు. రూ.1,39,90,000ల మోసానికి బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్‌లో పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పాల్పడ్డట్లు తేలింది. కేసులో భాగంగా ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 20, 2025
6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.