News April 11, 2025
కన్నుల పండువగా రాములోరి కళ్యాణం

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది భక్తులు తరలిరాగా మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అర్చకులు కళ్యాణం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించి భక్త జనం పులకించిపోయారు.
Similar News
News April 20, 2025
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

భీమవరంలోని గరగపర్రు రోడ్డులో శుక్రవారం రాత్రి ఇద్దరు బీటెక్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించిపోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన సాగర్(21) తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఇజ్రాయెల్ శనివారం తెలిపారు. మరో విద్యార్థి సాయి భరత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
News April 20, 2025
సిరిసిల్ల: ఓపెన్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మరో పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం (4) పరీక్షా కేంద్రాలలో పదో తరగతి 298, ఇంటర్ 856 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.
News April 20, 2025
ఏలూరు: ఊరేసుకుని వ్యక్తి మృతి

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తూర్పు వీధికి చెందిన దుర్గారావు (34) ఊరేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతిపై సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 2 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. ఈనెల 18న రాత్రి భార్యతో గొడవపడి రూమ్‌లోకి వెళ్లాడని భార్య చెప్పింది. శనివారం తలుపు తీస్తే ఊరికి వేలాడుతూ కనిపించాడని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.