News April 13, 2025
కన్నెపల్లి: ప్రభుత్వ భూమి కబ్జా.. ఏడుగురి అరెస్ట్

కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో S.No248 లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం తెలిపారు. మండల తహశీల్దార్ ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించి ఆ భూమిలో చెట్లను నరికివేశారన్నారు. దీంతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2025
స్మితా సబర్వాల్‌కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. IAS అధికారిణి <<16116901>>స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై<<>> చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. BJP నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచ భూములపై మోదీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ, BRS కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం కూలగొడితే కూలిపోయేది కాదని పేర్కొన్నారు.
News April 16, 2025
నల్గొండలో యువతి సూసైడ్

యువతి సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాన్యచెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 16, 2025
GNT: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగింపు

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు రిమాండ్‌ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.