News March 26, 2025
కన్నేపల్లిలో ముగ్గురు అరెస్ట్.. ఏడుగురు పరారీ

కన్నేపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.1500 నగదు, 2ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 26, 2026
BIG BREAKING: వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దీపక్ తివారీ మన జిల్లాకు కలెక్టర్‌గా రానున్నారు. ఇక్కడ చేసిన కలెక్టర్ నారాయణపేటకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సౌమ్యుడిగా ఆయన ప్రజల మన్ననలు పొందారు. పాఠశాలల మౌలిక వసతులపై దృష్టి సాధించి విద్యార్థుల బలోపేతానికి తనదైన ముద్ర వేశారు. అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్ రానున్నారు.
News February 26, 2026
BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 26, 2026
7న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన?

APలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. MAR 7న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి PM మోదీ, CM CBN, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ₹1.35L Crతో 2 దశల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించేందుకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.


