News March 26, 2025
కన్నేపల్లిలో ముగ్గురు అరెస్ట్.. ఏడుగురు పరారీ

కన్నేపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.1500 నగదు, 2ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News April 19, 2025
ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.
News April 19, 2025
VKB: పనిచేయని నిఘా నేత్రాలు.. రెచ్చి పోతున్న దొంగలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో చిన్న చిన్న లోపాలతో సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. వేల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన పర్యవేక్షణ లోపంతో పనిచేయడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కెమెరాలకు మరమ్మతులు చేయించాలని, గ్రామాల్లో నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
News April 19, 2025
ఈ నెల 23న ‘పది’ ఫలితాలు?

AP: ఈ నెల 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లిష్ మీడియం, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. Way2Newsలోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.