News January 21, 2025

‘కన్న కూతురిని చంపబోయాడు’

image

కన్న కూతురిని తండ్రి కడతేర్చాలని చూసిన ఘటన ఈ నెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. టేకులపల్లి మం. సంపత్ నగర్‌కు చెందిన కొర్స రవి-లక్ష్మి దంపతులు. రవి భార్యతో గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన అతను కూతురికి చాక్లెట్స్ కొనిస్తానని పక్కనే ఉన్న జామాయిల్లోకి తీసుకెళ్లి చంపబోయాడు. ఇంటికి వచ్చి బాలిక విషయం తల్లికి చెప్పడంతో అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News January 1, 2026

ఖమ్మం: ఐదేళ్లుగా అసంపూర్తిగానే అగ్రహారం అండర్ బ్రిడ్జి!

image

ఖమ్మం-బోనకల్ రహదారిలోని అగ్రహారం వద్ద రూ.18.50 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి (RUB) పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2021లో శంకుస్థాపన చేసినా, కోవిడ్, విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్పు వల్ల పనులు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News January 1, 2026

ఖమ్మం: సదరం సేవలపై సెర్ప్ సీఈవో సమీక్ష

image

సదరం అమలు, ధ్రువీకరణ పత్రాల జారీపై సెర్ప్ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News January 1, 2026

ఖమ్మం: కొత్తగా ఐదు కుష్టు వ్యాధి కేసులు

image

ఖమ్మం జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తైనట్లు డీఎంహెచ్‌ఓ డా.రామారావు తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు 2.55 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించగా 1,369 మంది అనుమానితులను గుర్తించారు. తుది పరీక్షల అనంతరం 5 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.