News August 28, 2024

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

image

మూడేళ్ల వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం మాచర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు రాత్రిపూట శీతలపానీయంలో మత్తు మందు కలిపి భార్య, కూతురికి తాగించాడు. మత్తులో నిద్రపోయిన వేళ కూతురుపై రోజు అత్యాచారం చేస్తున్నాడు. చిన్నారి మూత్రవిసర్జన సమయంలో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చూపిస్తే వైద్యులు అసలు నిజం చెప్పారు. 

Similar News

News November 27, 2025

విద్య వైద్యం ఇవ్వండి.. ఉచిత పథకాలు వద్దు: వెంకయ్య నాయుడు

image

తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను సోమరి పోతులుగా తయారు చేస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే చాలని, బస్సులు ఫ్రీగా ఇమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. సంపద సృష్టించాలి తప్ప అప్పులు చేయడం తప్పు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే పరిపాలన చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.

News November 27, 2025

అమరావతి ఎల్పీఎస్ లేఅవుట్లకు ప్రత్యేక పర్యవేక్షణ

image

అమరావతి ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఏపీసీఆర్డీఏ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రైతుల సమస్యలు, లేఅవుట్ల అడ్డంకులను పరిష్కరించేందుకు 17 మంది అధికారులను డిప్యూటేషన్‌పై నియమించనుంది. వారిలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, అయిదుగురు తహశీల్దారులు, అయిదుగురు డిప్యూటీ తహశీల్దారులు ఉన్నారు. వీరు భూయజమానులతో నేరుగా చర్చించి ఎల్పీఎస్‌లో భాగస్వామ్యం కల్పిస్తారు.

News November 26, 2025

GNT: ఎండీఎంఏ రవాణాపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

image

గుంటూరులో మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా మరింత కఠినమైంది. ఒక వారం వ్యవధిలో ఎండీఎంఏ కొనుగోలు,అమ్మకాలకు సంబంధించిన ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాల్లో డ్రగ్స్ దాచి యువతకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వృత్తి విద్య చదువుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని అలవాటు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బెంగళూరు–గుంటూరు మార్గంలో రవాణాపై నిఘా కొనసాగుతోంది.