News February 10, 2025

కన్మనూర్: విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే శ్రీహరి

image

మరికల్ మండలంలోని కన్మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై USలో అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

News November 28, 2025

HYD: ప్లీజ్.. పిల్లలను టెన్షన్ పెట్టకండి

image

పేట్ బషీరాబాద్ PS పరిధిలో స్కూల్ ఫీజు చెల్లించలేకపోవడంతో 8వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తప్పు యాజమాన్యానిదైనా.. తల్లిదండ్రులదైనా ఘోరం జరిగిపోయింది. చదువుకోవాలని ఉన్నా చదువు”కొనలేని” స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులూ ఇప్పటికైనా మారండి మేనేజ్ మెంట్‌తో మాట్లాడండి. పిల్లలకు సర్దిచెప్పండి. యాజమాన్యాలు కఠిన వైఖరి తగ్గించాలి. లేకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి.

News November 28, 2025

12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

image

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT