News November 8, 2024

కన్యాకుమారి వరకు సిక్కోలు కుర్రాడి సైకిల్ యాత్ర

image

శ్రీకాకుళం పట్టణానికి చెందిన యాగాటి ఉదయ్ అనే యువకుడు శ్రీకాకుళం నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశాడు. యువత డ్రగ్స్‌కి బానిసలు కాకూడదని, ఆడవారిని గౌరవించాలనే నినాదంతో గత నెల15న సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈనెల 7న గురువారం నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. 1900 కిలోమీటర్ల సైకిల్ యాత్రను 22 రోజుల్లో పూర్తి చేశాడు. ఉదయ్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు.

Similar News

News December 17, 2025

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా రమేష్ ?

image

శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇతను మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానం నుంచి ఉత్తర్వులు రానున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ని 26 జిల్లాలకు కొత్త టీడీపీ అధ్యక్షుల పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి.

News December 17, 2025

ఎచ్చెర్ల: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన’

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని AP మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పిల్లల రక్షణకు కూడా పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.

News December 17, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

image

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>