News November 6, 2024
కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలు లేవు: ఎస్పీ

దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్క గ్రామాల్లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం తవ్వకాలు లేవని ఎస్పీ తెలిపారు. యురేనియం తవ్వకాల గురించి వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
Similar News
News October 17, 2025
జనసేన అభిమాని అర్జున్ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

కర్నూలులో నిన్న జరిగిన జీఎస్టీ సభలో విద్యుత్ షాక్ తగిలి జనసేన అభిమాని అర్జున్ (15) మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతి తనను కలచివేసిందని పేర్కొన్నారు. అర్జున్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మరోవైపు మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అర్జున్ కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన వారు.
News October 16, 2025
కర్నూలులో మొట్టమొదటి ఈ-కోర్ట్ ప్రారంభం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కర్నూలులో ఈ-కోర్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా సాక్ష్యాన్ని అందించవచ్చని చెప్పారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
News October 16, 2025
కర్నూలుకు వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్

ప్రధాని నరేంద్ర <<18018303>>మోదీ<<>> తన ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని, అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల వంటి పలు రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ పర్యటనలో భాగమని పేర్కొన్నారు.