News October 21, 2024
‘కబ్జా చేసిన డాక్టర్ రవి కిరణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి’
ఆదోని: కబ్జా చేసిన డాక్టర్ రవి కిరణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ పట్టణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆక్రమణకు గురైన ఎస్కేడీ కాలనీ సర్వే నంబర్ 379బీ 380ఏ ప్లాట్ నంబర్ 33ను సీపీఐ పట్టణ సమితి నాయకుల ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కర్నూలులో నివాసముంటున్న కురువ హనుమంతమ్మ, లింగారెడ్డి దంపతులకు చెందిన 6 సెంట్ల స్థలాన్ని డాక్టర్ రవి కిరణ్ ఆక్రమించారని ఆరోపించారు.
Similar News
News November 7, 2024
యురేనియం తవ్వకాలపై దుష్ప్రచారం: ఎంపీ నాగరాజు
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలంటూ ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ నాగరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోర్ల తవ్వకాలు జరగడం లేదని అన్నారు. మరోవైపు యురేనియం తవ్వకాలంటూ అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.
News November 7, 2024
కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కమిషనర్
కర్నూలులో ఈ నెల 15న వినాయక ఘాట్ వద్ద నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్‌లో నగరపాలక, ఫైర్, విద్యుత్, ట్రాన్స్‌కో, జలవనరుల, మత్సకార, పోలీసు శాఖల అధికారులతో పాటు కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్తీక దీపోత్సవం నాడు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News November 6, 2024
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. R&B కాంట్రాక్ట్ బిడ్‌లకు అర్హత కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి R&B కాంట్రాక్టర్లకు భారీ ఊరట లభించనుంది.