News July 7, 2024
కమనీయంగా భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యా వాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ , అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని జరిపారు.
Similar News
News October 24, 2025
ఖమ్మం: మైనార్టీలకు వృత్తి శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన మైనార్టీలకు వివిధ రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ తెలిపారు. ప్రభుత్వ, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో (ఎన్‌ఎస్‌డీసీ) అనుబంధం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల శిక్షణా సంస్థలు నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News October 24, 2025
15 రోజుల్లో దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం, ఇతర అంశాలపై చర్చించి, తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 24, 2025
ఖమ్మం: టెండర్లకు భారీ స్పందన.. రూ.133 కోట్ల ఆదాయం

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 116 దుకాణాలకుగాను ఆఖరి రోజు వరకు 4,435 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.133 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న డ్రా పద్ధతిలో లైసెన్సు దారులను ఎంపిక చేయనున్నారు.


