News August 6, 2024
కమనీయంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Similar News
News November 18, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
News November 18, 2025
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

పేరెంట్-టీచర్స్ మీటింగ్ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.