News March 19, 2025
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం వేద పండితులు కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేసి, స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించి, స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Similar News
News October 21, 2025
మెదక్: 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరక అజయ్ కుమార్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
అరక జ్యోతి, సంజీవరావు కుమారుడు అజయ్ కుమార్ 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శిగా విధుల్లో చేరాడు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, 2023లో ఎస్ఐ, గ్రూప్-2లో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు.
News October 21, 2025
విజయనగరం జిల్లాలో 229 మందికి పదోన్నతులు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సహా 23 కేటగిరీల సిబ్బందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్థానిక డీపీటీఓ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ 229 మందిని ఎంపిక చేసే కసరత్తును మొదలుపెట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు.
News October 21, 2025
సిద్దిపేట: జన సేవలో ఎస్సై జాన్ విల్సన్

విధి నిర్వహణలో ప్రాణాలర్పించి జనం హృదయాల్లో నిలిచారు SI జాన్ విల్సన్. 1991లో రామవరంలో నక్సలైట్ల మందుపాతరకు సీఐ యాదగిరి, జాన్విల్సన్తోపాటు మరో 13 మంది చనిపోయారు. తన పెళ్లి కార్డులు ఇచ్చేందుకు వచ్చి విల్సన్ బలయ్యాడు. ఏడాదిన్నరపాటు హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసి పేదల పక్షపాతిగా, సామాన్యుల గుండెల్లో గూడుకట్టుకున్నారు. జాన్ విల్సన్ పేరిట ట్రస్టులు, బస్టాండ్లు, యూనియన్లు, స్మారక నిర్మాణాలు చేపట్టారు.