News February 26, 2026

కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.

Similar News

News April 14, 2026

ఖమ్మం: నిర్మాణ కూలీ రేట్లపై త్వరలోనే తుది నిర్ణయం

image

ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల కూలీ రేట్ల పెంపుపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో ప్రాథమికంగా చర్చించామని, అధికారికంగా ధరలు ఖరారు కాలేదని తెలిపారు. త్వరలోనే మరోసారి కార్మిక సంఘాల నేతలతో భేటీ నిర్వహించి, అందరి ఏకాభిప్రాయం మేరకు కొత్త రేట్లను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

News April 14, 2026

ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ వివరించండి: పొంగులేటి

image

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కొండంత అభివృద్ధిని కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

News April 14, 2026

మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

image

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.